Marri Shashidhar Reddy: మర్రి శశిధర్ రెడ్డి నిన్న తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణలతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఒక మంచి రోజున బీజేపిలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేసే స్టేజీలో లేదని ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పకనే చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్న మర్రి శశిధర్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా సంచలన ఆరోపణలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డిని గెలిపించుకునేందుకు తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇన్చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని ముంచేశాడని.. ఒకవేళ ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టకపోతే.. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని చెప్పి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు.  


కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండడటం లేదు. తన సొంత వర్గానికి చెందిన చెంచాగాళ్లను పెట్టి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వైఖరి నచ్చక తన లాగే చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడే ప్రమాదం ఉందని మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు. 3000 నుంచి 20 వేలకు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమే అవుతుందని పార్టీ నేతలకు చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నరని చెప్పి రేవంత్ రెడ్డి గురించి పెద్ద బాంబు పేల్చారు.


రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని వారించిన వారిలో తాను కూడా ఒకర్ని అని మర్రి శశిధర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy ) తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన మర్రి శశిధర్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై మూన్నెళ్ల క్రితమే పార్టీ హై కమాండ్‌కి వివరించాను అని అన్నారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతే పోయేదేమీ లేదని చెబుతూ పార్టీలోంచి తన నిష్క్రమణ గురించి తానే వ్యాఖ్యలు చేసుకున్నారు.  


కాంగ్రెస్ పార్టీలోనే ఎల్లకాలం కొనసాగుతాను అని అనుకున్నాను. కాంగ్రెస్ వాదిగానే ఉంటాను అని భావించాను కానీ పార్టీ మారుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే ఇప్పుడిలా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారక తప్పడం లేదు అని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాను రాజకీయ నాయకుణ్ణేనని, ఇంకా రిటైర్ కాలేదని తనని లైట్ తీసుకుంటున్న వారికి గుర్తుచేశారు.


Also Read : Padi Kaushik Reddy: ఎమ్మెల్సీనే కానీ తృప్తి లేదు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Also Read : MP Arvind: కాంగ్రెస్ సీనియర్ నాకు ఫోన్ చేసి చెప్పారు.. కవిత ఫోన్ ట్యాప్ చేస్తే నిజం తెలుస్తది కదా: ఎంపీ అరవింద్‌


Also Read : నా గురించి ఇంకోసారి మాట్లాడితే.. చెప్పుతో కొడతా! ఎంపీ అరవింద్‌కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook