National Anthem: తెలంగాణలో ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడే బంద్..
National Anthem: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది.రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.మంగళవారం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. మంగళవారం ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టింది.
National Anthem: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈనెల8న మాదాపూర్ హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ ఉత్సవాలను ప్రారంంభించారు. రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు జరపనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న వేడుకల్లో మంగళవారం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. మంగళవారం ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టింది. ఉదయం 11.30 గంటలకు తెలంగాణవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11.30కి ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపాన చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ నిర్వహిస్తారు. హైదరాబాద్ పాటు ఇతర ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో వాహనదారుల జాతీయ గీతాలాపన చేసేలా ఏర్పాటు చేశారు. ఆ నిమిషం సేపు ట్రాఫిన్ ను నిలిపివేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామూహిక జాతీయ గీతాలాపాన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో మైక్ సెట్లు అమర్చారు. ట్రాఫిక్ ను నిలిపివేసి వాహనదారులంతా ఎక్కడిక్కడే నిలబడి జాతీయ గీతం ఆలపించేలా పోలీసు శాఖ సర్వం సిద్ధం చేసింది. దీనిపై రెండు, మూడు రోజులుగా అవగాహాన కార్యక్రమాలు కూడా నిర్వహించింది పోలీస్ శాఖ.
ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సామూహిక జాతీయ గీతాలాపానలో పాల్గొంటారు. హైదరాబాద్ ఆబిడ్స్ జీపీవో కూడలిలో జరిగే జాతీ గీతాలాపన కార్యక్రమలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎస్ సోమేష్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్ల వద్ద ఎక్కడివారు అక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు.జాతీయ గీతాలాపన సమయంలో కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్ సిగ్నళ్లు వేయనున్నారు. ఆ సమయంలో నిమిషం పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి.ఈసమయంలో వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
Read Also: బీహార్‌లో నేడు కొలువదీరనున్న కొత్త కేబినెట్.. ఆర్జేడీకి 16, జేడీయూకి 11 కేబినెట్ బెర్తులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook