Bihar Cabinet Expansion: బీహార్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రమే ఉన్న కేబినెట్‌లోకి కొత్తగా మరో 30 మంది చేరే అవకాశం ఉంది. కొత్త కేబినెట్‌లో ఆర్జేడీ తరుపున 16 మంది ఎమ్మెల్యేలు, జేడీయూ తరుపున 11 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు పాట్నాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి ఉన్నా సంఖ్యా బలం కారణంగా ఆ పార్టీకి ఎక్కువ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందులో ఎక్కువగా యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఆ పార్టీ పెద్ద పీట వేసే అవకాశం ఉంది. అలాగే దళిత, బీసీ నేతలకు కూడా అవకాశం కల్పించనున్నారు. గత మహాకూటమి ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కి ఈసారి చోటు దక్కేది అనుమానమే.
మహాకూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు, జీతన్ రామ్ మాంజీ హిందూస్తానీ ఆవామీ మోర్చాకి ఒక కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. కేబినెట్‌లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్‌కి కూడా అవకాశం దక్కవచ్చు. గత జేడీయూ-బీజేపీ కేబినెట్‌లో సుమిత్ కుమార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్‌గా ఉన్నారు.
కాగా, ఈ నెల 9న నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిని వీడిన సంగతి తెలిసిందే. దీంతో బీహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే నితీశ్ కుమార్ ఆర్జేడీతో చేతులు కలిపారు. 2015 తరహాలోనే మరోసారి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న ముఖ్యమంత్రిగా నితీశ్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఇవాళ పూర్తి స్థాయి కేబినెట్ కొలువదీరనుంది.
Also Read: CM Kcr: తెలంగాణలో రేపే సామూహిక జాతీయ గీతాలాపన..ఎక్కడివారెక్కడే గప్‌చుప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook