Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో పెద్దకాల్వల శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వేగంగా ఢీకొంది.
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో పెద్దకాల్వల శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్కార్పియోలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని వైద్య నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తేనని పోలీసులు భావిస్తున్నారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న వారందరూ మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read: Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్, భర్త రాణాలపై మరో ఎఫ్ఐఆర్, బాంద్రా కోర్టులో హాజరు
Also Read: PK-KCR: కేసీఆర్‌తో పీకే వరుస సమావేశాలు, మరి కాంగ్రెస్‌లో చేరిక సంగతేంటి, అసలేం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.