Fire in Hotel: హైటెక్ సిటీ హోటల్‌లో మంటలు.. 20 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
Fire in Hotel: హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ నానక్ రాంగూడలోని ఓ హోటల్ లో మంటలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. హోటల్ ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు విస్తరించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి
Fire in Hotel: హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ నానక్ రాంగూడలోని ఓ హోటల్ లో మంటలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. హోటల్ ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు విస్తరించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలకు తాళలేక హోటల్ లో చిక్కుకున్న జనాలు, హోటల్ సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. తమను రక్షించాలని కేకేలు వేశారు.
అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. భారీ క్రేన్ ఉపయోగించి భవనం లోపల చిక్కుకున్న 20 మందిని కాపాడారు.ప్రమాదం జరిగిన భవనం ఫస్ట్ ఫ్లోర్ లో గ్రీన్ బావర్చి హోటల్ ఉండగా.. సెకండ్, థర్డ్ ఫ్లోర్లలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఉన్న అంతస్తులో పొగ అలుముకుంది. భవనం రెండో అంతస్తులో మొదల మంటలు వచ్చాయని.. తర్వాత మూడో ఫ్లోర్ కు వ్యాపించాయని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని హోటల్ సిబ్బంది చెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్కై లిఫ్ట్ ద్వారా కిందకి దించారు. దట్టమైన పొగతో అస్వస్థతకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించారు.
భవనంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకా.. లోపలికి వెళ్లి గాలించింది రెస్క్యూ టీమ్. మంటల్లో చిక్కుకుని లోపల ఎవరైనా పడిపోయారేమో చూశారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడం వల్లే ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.
READ ALSO: BJP SHOCK: తెలంగాణ బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి సీనియర్ నేత జంప్!
READ ALSO: ROJA COMMENTS: బాలకృష్ణను మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యారు! మంత్రి రోజా సంచలన ఆరోపణలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook