BJP SHOCK: తెలంగాణ బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి సీనియర్ నేత జంప్!

BJP SHOCK: జాతీయ నేతల పర్యటనలతో ఫుల్ జోష్ లో ఉంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోడీ,  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు సక్సెస్ అయ్యాయని భావిస్తున్న కమలం నేతలు.. తమ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెబుతున్నారు. కాని తాజాగా తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు

Written by - Srisailam | Last Updated : May 28, 2022, 02:07 PM IST
  • తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్
  • పార్టీకి రాజీనామా చేసిన శోభారాణి
  • కమలనాథుల్లో కలవరం
 BJP SHOCK: తెలంగాణ బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి సీనియర్ నేత జంప్!

BJP SHOCK: జాతీయ నేతల పర్యటనలతో ఫుల్ జోష్ లో ఉంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోడీ,  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు సక్సెస్ అయ్యాయని భావిస్తున్న కమలం నేతలు.. తమ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెబుతున్నారు. కాని తాజాగా తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆమె లేఖ రాశారు. కొన్ని కారణాల వల్ల బీజేపీలో తాను పని చేయలేకపోతున్నానని లేఖలో చెప్పారు బండ్రు శోభారాణి. జిల్లా నాయకులు ఒంటెద్దు పోకడలపై పార్టీ దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో బీజేపీలో కొనసాగడం కష్టమనీ, అందుకే పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు శోభారాణి.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన శోభారాణి గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు. వామపక్ష ఉద్యమ నేపథ్యం ఉన్న శోభారాణికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. బీసీ నేతగా ఆమెకు ఆ వర్గాల నుంచి మద్దతు ఉంది. గరికపాటి మోహన్ రావు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సందర్భంగా అతనితో పాటు శోభారాణి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. తర్వాత ఆమెను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కాని జిల్లా నేతల తీరుపై బండ్రు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. టీడీపీలో పని చేసినప్పుడు రేవంత్ రెడ్డితో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని తెలుస్తోంది. త్వరలోనే శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెబుతున్నారు.

పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న శోభారాణి రాజీనామా చేయడం బీజేపీకి పెద్ద షాకే అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పోటాపోటీ రాజకీయ సాగుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తామేనని నిరూపించుకునే ప్రయత్నాల్లో  విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాతే చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. అయితే కొన్ని రోజులుగా సీన్ మారింది. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న ఓదేలు.. సడెన్ గా మనసు మార్చుకుని హస్తం గూటికి చేరారు. తాజాగా మరో నేత బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందనే మెసేజ్ జనంలో వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన జరిగిన మరుసటి రోజే సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పడం కమలనాథులను కలవరపరుస్తుందని అంటున్నారు. బీజేపీకి రేవంత్ రెడ్డి పెద్ద దెబ్బే కొట్టారని చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముందు ముందు మరిన్ని వలసలు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఉంటాయంటున్నారు.

READ ALSO: KCR DELHI POLITICS: దసరా తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ మకాం! కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం?

READ ALSO: NTR JYANTHI: ఆ పేరే తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్.. యుగ పురుషుడికి శతకోటి నివాళులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News