Massive Traffic Jam: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి సమీపంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై (Hyderabad Vijayawada Highway) భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. డివైడర్‌ను ఢీకొట్టిన ఓ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు లారీని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా హైదరాబాద్-విజయవాడ (Hyderabad Vijayawada Highway) మార్గంలో పండగల సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Traffic Jam) ఏర్పడుతుంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండగల (Festivals) సమయంలో నగరవాసులు సొంతూళ్ల బాట పడుతారు కాబట్టి.. ఆ సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది.


గత నెలలో దసరా, బతుకమ్మ పండగల సమయంలో చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో (Massive Traffic Jam) చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


Also Read: Rain Alert: అండమాన్ తీరంలో అల్పపీడనం...ఏపీ, తమిళనాడులకు భారీ వర్ష సూచన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook