తెలంగాణ రాష్ట్రం ( Telangana state ) లో వైద్యవిద్యకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్ 2020 ( NEET 2020 ) అర్హత ప్రకారం ఆన్‌లైన్  దరఖాస్తులకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం  నోటిఫికేషన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్ టెస్ట్  ఫలితాలు ( NEET 2020 Results ) ఇప్పటికే వెలువడటంతో ఇక వివిధ రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో వైద్యవిద్య అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. ఎంబీబీఎస్ ( MBBS ), బీడీఎస్ ( BDS ) కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్  దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవాళ  నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు  నమోదు చేసుకోవాలని యూనివర్శిటీ తెలిపింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన   పీజీ తరహాలోనే జరగనుంది.


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ( Online Registration ) ప్రక్రియ నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం  5 గంటల‌ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. నిర్ధేశిత ధరఖాస్తును పూర్తి చేసి..సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.  ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను  విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించిన సమాచారం,  అర్హత ఇతర విషయాల కోసం  యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in సందర్శించాల్సి ఉంటుంది. Also read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback