BRS Party: మెదక్ బీఆర్ఎస్లో కుర్చీలాట.. కీలక నేతలు జంప్!
Padma Devender Reddy: ఆ నియోజకవర్గంలో కారు పార్టీలో లోడ్ ఎక్కువైందా..! ఆ నలుగురు లీడర్లు నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తున్నారా..! నేతల తీరుతో మాజీ ఎమ్మెల్యే సైతం తలపట్టుకుంటున్నారా..! అటు క్యాడర్ సైతం ఎవరితో తిరిగితే ఎక్కడి సమస్యలు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారా..! ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పంచాయతీ నడుస్తోంది..!
Padma Devender Reddy: ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు బీఆర్‌ఎస్ కంచుకోట.. తెలంగాణ ఉద్యమం సమయంలో మెదక్ జిల్లా ప్రజలంతా బీఆర్‌ఎస్ వెంటే నడిచారు. 2004 లో మెదక్‌నుంచి తొలిసారి గెలిచిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అనేక మార్లు పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.. అయితే మెదక్ నియోజకవర్గంలో లెక్కకు మించిన లీడర్లు ఉండటంతోనే పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని ప్రచారం సైతం ఉంది. ఇప్పుడు ఇదే సమస్య గులాబీ పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారిందట.. కారు పార్టీ ఓవర్ లోడ్ కావడంతో కొందరు నేతలు కారు దిగేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.
ఇక బీఆర్‌ఎస్ పార్టీలో తొలినుంచి కొనసాగుతున్నారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటుపై మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కన్నేశారు. గతంలో మైనంపల్లి మెదక్ నుంచి గెలవడంతో ఆ సీటు మరోసారి తనకే కావాలంటే పట్టుబట్టారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని ప్రకటించడంతో.. మైనంపల్లి నారజ్ అయ్యారు. మెదక్ అసెంబ్లీ నుంచి మైనంపల్లి కుమారుడు రోహిత్ రావును బరిలో దింపాలని యోచించారు. అయితే చివరి నిమిషం వరకు సీటు దక్కకపోవడంతో మైనంపల్లి పార్టీ మారారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి రెండు సీట్లు సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి ఓడిపోగా.. కొడుకు రోహిత్ రావు మాత్రం మెదక్‌లో భారీ విజయం సాధించారు. అయితే పద్మా ఓటమికి సొంత పార్టీ లీడర్లు కూడా ఓ కారణమని ఆ తర్వాత తేలిందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం మెదక్ బీఆర్‌ఎస్ నలుగురు నేతల మధ్య పంచాయతీ తారస్ధాయికి చేరినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పద్మా దేవేందర్ రెడ్డి వర్సెస్ శేరి సుభాష్ రెడ్డిగా పైట్ జరిగింది. ఈ పంచాయితీతో మరో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోనేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇలా ఒకే నియోజకవర్గంలో నలుగురు నేతల మధ్య పంచాయితీ ముదిరిపాకనపడినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలంతా గ్రూపులుగా విడిపోవడంతో ఎవరివెంట తిరిగితే ఎవరి నుంచి ముప్పు వస్తుందో అని క్యాడర్ తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో లేదు. దాంతో నామినేటేడ్ పదవులు దక్కే పరిస్ధితి లేదు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే. ఈ నేపథ్యంలో పార్టీ మారే యోచనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తమ అదృష్టం బాగుంటే ఏదైనా పదవి దక్కొచ్చని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం.
Also Read: Congress Politics: కేబినెట్ విస్తరణలో ట్విస్ట్.. నలుగురే కొత్త మంత్రులు!
Also Read: Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.