Medaram Jatara: మేడారం జాతరలో విషాదం.. తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి
Stampede in Medaram Jatara: మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. సమ్మక్క తల్లి ఆగమనం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందారు.
Stampede in Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో గురువారం (ఫిబ్రవరి 17) రాత్రి అపశృతి చోటు చేసుకుంది. సమ్మక్క తల్లిని గద్దెల పైకి తీసుకొచ్చిన సమయంలో క్యూ లైన్‌లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. భక్తులను చాలాసేపు క్యూ లైన్‌లో నిలిపి.. సమ్మక్క ఆగమనం సమయంలో ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో గాయపడినవారికి ప్రథమ చికిత్స అందించే లోపే వారు మృతి చెందినట్లు సమాచారం.
తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీల సెక్యూరిటీకి ప్రాధాన్యమిచ్చే పోలీసులు సామాన్య భక్తుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందంటున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర రేపటితో (ఫిబ్రవరి 19) ముగియనుంది. ఈసారి మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం మేడారంలో ఎటు చూసినా భక్త జనసంద్రమే కనిపిస్తోంది.
రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ములుగు జిల్లా కేంద్రానికి 44 కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో మొదటి రోజు సారలమ్మ మేడారం గద్దెల పైకి చేరుతుంది. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి ఊరేగింపుగా సమ్మక్కను గద్దెల పైకి తీసుకొస్తారు. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క గద్దెల పైకి చేరుతుంది. మూడో రోజు సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
Also Read: Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!
Also Read: Mallareddy on CM KCR: కేసీఆర్ ప్రధాని కావాలని మేడారంలో మంత్రి మల్లారెడ్డి మొక్కు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook