Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!

Coach Simon Katich leaves SRH: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ సరైన జట్టును కొనుగోలుచేయలేదని ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 02:46 PM IST
  • సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌
  • సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్
  • తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్న ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు
Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!

Coach Simon Katich leaves SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజన్‌ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్రాంచైజీ సరైన జట్టును కొనుగోలుచేయలేదని ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 'ది ఆస్ట్రేలియన్' అనే పత్రిక ఈ విషయాన్ని తమ కథనంలో పేర్కొంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఈ విషయాన్ని ద్రువీకరించాల్సి ఉంది. 

'ది ఆస్ట్రేలియన్' ప్రకారం.. ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు వేసిన ప్రణాళికలను బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం విస్మరించిందట. ఎస్‌ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్య మార‌న్ స‌రైన జ‌ట్టును కొనుగోలు చేయ‌లేద‌ని సైమ‌న్ క‌టిచ్ అభిప్రాయ‌ప‌డుతున్నాడట. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో అతడికి విభేదాలు రావడంతోనే తన పదవికి రాజీనామా చేశాడట. ఏదేమైనా ఈ విషయంతో స‌న్‌రైజ‌ర్స్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. 

సరైన ఆటగాళ్లు లేకపోవడంతో ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెత్త ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి.. కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముఖ్యంగా యూఏఈలో జరిగిన రెండో దశ మ్యాచుల్లో పూర్తిగా చేతులెత్తేసింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం, తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొత్త సారథి కేన్ విలియంసన్ కూడా జట్టు తలరాతను మార్చలేకపోయాడు.

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ కొత్త సిబ్బందిని నియమించింది. మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ టామ్ మూడీ కోచ్‌గా ఉండగా.. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. బెంగళూరు మాజీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా.. ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా డేల్‌ స్టెయిన్‌.. స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్‌.. ఫీల్డింగ్‌ కోచ్‌ మరియు స్కౌట్‌గా హేమంగ్‌ బదాని నియమించుకుంది. అయితే వేలంలో సరైన జట్టును కొనుగోలుచేయలేదని క‌టిచ్ త‌ప్పుకోవ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.

Also Read: Samantha Dance: విజయ్ పాటకు ముందు పూజా హెగ్డె.. ఆ తర్వాత సమంత! పోటాపోటీ స్టెప్పులు అదిరాయి!!

Also Read: Mallareddy on CM KCR: కేసీఆర్ ప్రధాని కావాలని మేడారంలో మంత్రి మల్లారెడ్డి మొక్కు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News