ఓటరు కార్డు, కరెంట్ బిల్లు, కులధృవీకరణ పత్రాలు, జనన, మరణ సర్టిఫికెట్లు ఇలా అనేక రకాల ప్రభుత్వ సేవలు మనం ' మీ సేవ' నుంచి పొందుతున్నాం. అన్ని సేవలకు ఆధారంగా మారిన మీసేవ మూతబడుతోంది. మనకు కొంత షాక్ కు గురిచేసే అంశమైనప్పటికీ ఇది మాత్రం నిజం. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి  మీ సేవా కేంద్రాలు మూసివేస్తామని నిర్వాహకులు వార్నింగ్ ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారణం ఇదే..
పదేళ్ల క్రితం మీ- సేవా సర్వీసులకు ధరలు నిర్ణయించిన ప్రభుత్వం... ప్రస్తుత ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని నిర్వాహ‌కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలను సవరించకుంటే ఈ మేరకు  మీ-సేవ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ మీ-సేవ జేఏసీ నిర్ణయించింది.


ఓటర్లకు కష్టాలు...
ఓటరు కార్డులకు మీ సేవా కేంద్రాలే కేంద్రాలే ఆధారం. తెలంగాణ ప్రాంతంలో ఓటరు జాబితాలో పేరున్నా చాలామందికి ఓటరు కార్డు లేదు.. తొలిసారి పేరు నమోదు చేసుకున్న వారికీ ఇంకా కార్డులు లేవు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఓటరు కార్డులు పొందేందుకు వీలుగా ఎన్నికల సంఘం త్వరలో అనుమతి ఇవ్వనుంది.  ఓటర్ల జాబితాలో కొత్తగా 17 లక్షల మంది చేరారు. వీరితో పాటు కార్డులు లేని వారు వాటి కోసం ఎక్కువగా ఆధారపడేది మీ-సేవ కేంద్రాలపైనే. ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో మే సేవ బంద్ వార్త ఓటర్లుకు షాక్ కు గురిచేస్తోంది