Niharika Put End for Rumors: హైదరాబాద్ పబ్ వివాదంలో చిక్కుకుని చాలా రోజులు సైలెంట్ గా ఉన్న నిహారిక ..ఇప్పుడో స్పెషల్ అప్ డేట్ తో సోషల్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మెగా డాటర్ తన భర్తతో విడిపోయిందంటూ వచ్చిన వార్తలకు సైతం తన తాజా చర్యలతో చెక్ పెట్టింది. హైదరాబాద్ లో ఇటీవల ఓ పబ్ పై జరిగిన పోలీసుల దాడితో నిహారిక పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనలకు విరుద్ధంగా ఆ పబ్ రేవ్ పార్టీ నిర్వహించినట్లు ఆరోపణలు రావడం.. అక్కడ డ్రగ్స్ వినియోగించినట్లు తేలడంతో కేసులు నమోదయ్యాయి. పబ్లో పార్టీ చేసుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. అలా పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టిన వారిలో నిహారిక కూడా ఉండటంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.


దీనిపై ఆమె తండ్రి నటుడు, నాగబాబు వెంటనే క్లారిటీ ఇస్తూ  ఓ వీడియో విడుదల చేశారు. తన కుమార్తె నిప్పు అంటూ చెప్పుకొచ్చారు. అయినా నిహారికను టార్గెట్ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. భర్తను వదిలి అంత అర్థరాత్రి వరకు పబ్ లో ఉండటమేంటని నిహారికను తప్పు పట్టారు. తన కుమార్తెను వెనకేసుకొచ్చిన నాగబాబునూ ట్రోల్ చేశారు.


నిజానికి  నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆమె హఠాత్తుగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిహారికకు ఆమె భర్త చైతన్యకు మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెడుతూ నిహారిక తన భర్తతో ఉన్న ఫోటోలను విడుదల చేసింది.


 నిహారిక, ఆమె భర్త కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇటీవలే మరో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక రిసెంట్ గా షేర్ చేసింది. నిహారిక, ఆమె భర్త చైతన్య, వారి టీమ్ సభ్యులు ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.


ఆర్యన్ రాజేశ్ ప్రధాన పాత్రలో నిహారిక దంపతులు కొత్త ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. హలో వరల్డ్ పేరుతో నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ వెబ్ కంటెంట్ ను జీ5లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లాంచింగ్  వారి కార్యాలయంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. మొత్తమ్మీద తనకు తన భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విషయంపై నిహారిక ఇలా క్లారిటీ ఇచ్చిందంటున్నారు.


Also read: TIMS Hospitals: హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం


Also read: King Cobra in Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో నాగుపాము కలకలం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook