Rythu bandhu scheme money: పాత బకాయిల కింద రైతు బంధు సాయం.. స్పందించిన మంత్రి హరీష్ రావు, బ్యాంకులకు ఆదేశాలు
Rythu bandhu scheme money in bank accounts: హైదరాబాద్: రైతుబంధు నిధులను పాత బకాయిల కింద సర్దుబాటు చేస్తున్న కొన్ని బ్యాంకులు.. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి అంగీకరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.
Rythu bandhu scheme money in bank accounts: హైదరాబాద్: రైతుబంధు నిధులను పాత బకాయిల కింద సర్దుబాటు చేస్తున్న కొన్ని బ్యాంకులు.. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి అంగీకరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని బ్యాంకర్స్ తో సమావేశమైన మంత్రి హరీష్ రావు.. రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడి సాయం అందించే గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం అని, ఆ డబ్బులు రైతులకు చేరకుండా బ్యాంకులు ఆపొద్దని అన్నారు. ఈ మేరకు ఆయన బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.
రైతుబంధు సొమ్మును విత్ డ్రా (Rythu Bandhu money withdrawal) చేయడానికి వీల్లేకుండా పాత బకాయిల కింద వాటిని సర్దుబాటు చేయడం సరికాదని బ్యాంకర్లకు సూచించారు. ఒకవేళ ఇప్పటికే ఏవైనా సర్దుబాటు చేసినట్టయితే.. వెంటనే ఆ డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేయాలని బ్యాంకర్లను మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఆదేశించారు.
Also read : Addaguduru lockup death case: అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెన్షన్
తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రైతు బంధు పథకం అమలులో రైతులకు సమస్యలు ఉంటే రైతు బంధు హెల్ప్ లైన్ నెంబర్ 7288876545 పై (Rythu bandhu scheme helpline number) సంప్రదించవచ్చు.
Also read : TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook