ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు (Harish Rao) పిలుపునిచ్చారు. చెట్లను పెంచాలని, అడవులను సంరక్షించాలని, ప్లాస్టిక్‌ని ఎలాగైనా నివారించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  జీవకోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపైనే ఆధారపడి ఉందన్నారు. అందుకోసం సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంల చేపట్టాలన్నారు.  నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘జీవ కోటి మనుగడ అనేది ప్రకృతి, పర్యావరణంపై ఆధారపడి ఉంది. భూమండలంలో అన్నింటికంటే విలువైనది ప్రకృతి. మొక్కలు లేకపోతే మానవ మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఓ మొక్కను నాటాలి. చెట్లు, అడవుల్ని పరిరక్షించుకోవాలి. ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ప్రకృతిపై దృష్టి పెడుతున్నాయి.  లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’‌ని చూశారా!


సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలి. చెట్లు, అడవుల పరిరక్షణను ఓ ఉద్యమంలా చేపడితేనే ఫలితం ఉంటుంది. లేకపోతే కాలుష్యం బాగా పెరిగి ప్రజలు కొత్త కొత్త వ్యాధులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చెట్ల పెంపకంతో పాటు ప్లాస్టిక్ నివారణ అంతే ముఖ్యం. రాబోయే రోజుల్లో  ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ప్రకృతి, పర్యావరణంపై బోధించాలి. ప్రతి ఒక్క విద్యార్థితో మొక్క నాటించాలని’ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
  
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి