CM KCR Public Meeting in Medak: మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని.. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని అన్నారు. మెదక్‌లో పదికి పది సీట్ల గెలుపు పక్కా అని.. సీఎం కేసీఆర్‌కు గెలుపు బహుమతిగా ఇస్తామన్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"టేకేదార్లకు కూడా పింఛను ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్ గారు మెదక్ వేదికగా ప్రారంభిస్తారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారు. తర్వాత జిల్లా కలెక్టరెట్‌లో అధికారులతో మాట్లాడుతారు. 3 గంటల సమయంలో సభకు హాజరవుతారు. సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపే సభ ఇది. బీఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయి. ఈ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదు. కేడర్ అంతా ఉత్సవాలు జరుపుతున్నాయి.


కాంగ్రెస్ వాళ్లు లీడర్లు లేరు, బీజేపీ వాళ్ళు కేడర్ లేదు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. దేశం మెచ్చే విధంగా కేసీఆర్ పాలన ఉంది. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టింది. మనం గుర్తు ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట. బీఆర్ఎస్‌కు.. బీజేపీకి ఉన్న తేడా ఇదే.." అని హరీశ్ రావు అన్నారు. 


అంతకుముందు అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని సందర్శించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.


Also Read: Kothagudem BRS MLA Ticket: కొత్తగూడెంలో సీన్ చేయొద్దని మంత్రి హరీశ్ రావు క్లాస్ ?


Also Read: Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook