Telangana Suparipalana Dinotsavam In Sangareddy: ఉద్యమ సమయంలో  తెలంగాణ ఇస్తే.. నక్సలైట్ల రాజ్యం వస్తుంది.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటదని అన్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్ ఉండదని కామెంట్స్ చేశారని.. కానీ తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన అవన్నీ తప్పు అని నిరూపించిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆరోపణల తప్పు అని కేసీఆర్ నిరూపించారని అన్నారు. అన్ని రంగాల్లో 24 గంటల విద్యుత్‌తో తెలంగాణ వెలుగుల జిలుగుగా మారిందన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని.. తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తెలంగాణలో అవలంభిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తం అమలు చేస్తున్నారు. సుపరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. నిరంతర కరెంట్‌తో పరిశ్రమల అభివృద్ధి. నాడు ఏ కారణాలు అయితే చెప్పి తెలంగాణను అడ్డుకున్నారో.. ఎలాంటి అనుమానాలు పెట్టారో అందరికీ తెలిసిందే. తెలంగాణను వ్యతిరేకించి నేను తప్పు చేసిన అని లగడ పాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఆయన అలా అని అంటారు. మనం కిందపడితే నవ్వే వాళ్లు.. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు తల ఎత్తుకునేలా చేశారు.


తెలంగాణ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగెలా చేశారు. ఆన్‌లైన్ ఆడిట్‌లో నెంబర్ 2 తెలంగాణ. కేంద్రం మంత్రుల సబ్ కమిటీ వేసి మన మోడల్ దేశ వ్యాప్తంగా చేయాలని చూస్తున్నారు. మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి రోల్ మోడల్ అయ్యాయి. చిన్న జిల్లాలు ఏర్పాటు, కలెక్టర్లు పెరగడం వల్ల ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయి. కొత్త జిల్లా తర్వాత 769 కొత్త అధికారులు ఒక్క సంగారెడ్డి జిల్లాలో వచ్చారు. ఏళ్ల తరబడి కొట్లాడినా మండలాలు ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ 9 కొత్తవి ఇచ్చారు. 190 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం.


తండాలు పంచాయతీలు చేస్తా అని కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టి మోసం చేసింది. ఈ దేశంలో అందరికీ సంఘం ఉంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంఘం లేదు. 116 రైతు వేదికలు ఈ జిల్లాలో ప్రారంభించాం. మహారాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వచ్చి ఇక్కడి పథకాలు చూసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ గొప్పతనం తెల్వాలంటే గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు చూడాలి. బీజేపీ వాళ్లు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తెలంగాణపై విమర్శలు చేస్తారు. ధరణి వచ్చింది కాబట్టే.. రైతు బంధు డబ్బులు కటుక ఒత్తితే రైతుల అకౌంటల్లో డబ్బులు పడుతున్నాయి. నయా పైసా లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చే 60 వేల కోట్లు రైతు బంధు కింద 65 లక్షల మందికి చేరాయి అంటే ధరణి వల్లే.." అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.


Also Read:  AP ICET 2023 Results: ఏపీఐసెట్ 2023 పరీక్ష ఫలితాలు https://cets.apsche.ap.gov.in/లో, ఇలా చెక్ చేసుకోండి


సుపరిపాలన.. హైటెక్ అనే ఒక లీడర్ ఉండే ఏపీ వెనకబడి పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'మాటలు కోటలు దాటాయి.. చేతలు పకోడీ చేసినట్లు ఉంది. వాళ్లది పని తక్కువ.. మనది పని ఎక్కువ. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధి చెందింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. పైరవీలు నేడు లేనే లేవు. ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. దళారీ వ్యవస్థ కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది అందుకే మా పాలన తెస్తాం అంటున్నారు. తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది. కులం, మతం చూడకుండా పథకాలు అర్హులకు అందేలా చేస్తున్నాం..' అని హరీష్ రావు పేర్కొన్నారు.


Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి