AP ICET 2023 Results: ఏపీఐసెట్ 2023 పరీక్ష ఫలితాలు https://cets.apsche.ap.gov.in/లో, ఇలా చెక్ చేసుకోండి

AP ICET 2023 Results: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2023 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకై నిర్వహించే ఐసెట్ ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/. చెక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2023, 08:49 AM IST
AP ICET 2023 Results: ఏపీఐసెట్ 2023 పరీక్ష ఫలితాలు https://cets.apsche.ap.gov.in/లో, ఇలా చెక్ చేసుకోండి

AP ICET 2023 Results: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఐసెట్ 2023 ఉత్తీర్ణులవాలి. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ఈ పరీక్షను నిర్వహించింది. త్వరలో ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఐసెట్ 2023 ఫలితాల్ని విడుదల చేయనుంది. అభ్యర్ధులు తమ పరీక్ష ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలంటే..

ఏపీఐసెట్ 2023 ప్రవేశ పరీక్ష మే 24వ తేదీన జరిగింది. ఈ పరీక్ష ఫలితాలు వాస్తవానికి నిన్న అంటే జూన్ 9వ తేదీన విడుదల కావల్సి ఉన్నా..కొన్ని కారణాలతో ఆలస్యమైంది. ఇవాళ  లేదా రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నిర్వహించిన ఐపీఐసెట్ 2023 ఫలితాల్ని నేరుగా https://cets.apsche.ap.gov.in/.ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎనాలిటికల్, కమ్యూనికేషన్, మేథమేటిక్స్ ఎబిలిటీస్‌లో 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించారు. 

ఏపీఐసెట్ 2023 పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవడం

ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://cets.apsche.ap.gov.in/.సందర్శించాలి. ఆ తురవాతహోమ్ పేజీలో కన్పించే రిజల్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ నెంబర్, హాట్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. అంతే స్క్రీన్ పై ఏపీఐసెట్ 2023 పరీక్ష ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.

Also read: AP Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్, మరో రెండ్రోజుల్లోనే రుతుపనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News