Harish Rao Comments On SC and ST Declaration: రాష్ట్రంలో ఏమూలకు పోయినా.. ఎవ్వరిని అడిగినా మళ్లా వచ్చేది బీఆర్ఎస్ సర్కారు అంటున్నారని మంత్రి హరీశ్ అవున్నారు. ఇందులో ఎవ్వరికి అనుమానం లేదని.. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్కు కొట్టేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కానే కాదన్న తెలంగాణను సాధించి చూపెట్టింది కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపింది కేసీఆర్ అని.. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నాగర్ కర్నూల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లు కొబ్బరి కాయలు కొడితే తెలుగు దేశం వాళ్లు మొక్కలు నాటారు. తెలుగు దేశం వాళ్లు కొబ్బరికాయలు కొడితే ఆ శిలాఫలకాల దగ్గర కాంగ్రెస్ వాళ్లు మొక్కలు నాటారు. నీళ్లు మాత్రం రాలేదు. ప్రాజెక్టును పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీల్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ పాలనలో తాగడానికి నీళ్లు లేవు, రోడ్లు లేవు. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లే. శ్రీశైలం ముంపు బాధితులకు జీవో కూడా మా వల్లే వచ్చింది.


కాంగ్రెస్ వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్. ఎందుకు పనికిరాని డిక్లరేషన్. కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఖర్గే గారిది కర్ణాటక రాష్ట్రం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఎలాగూ అధికారంలోకి రామని ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తున్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటి అమలు చేయలేదు కాంగ్రెస్. తండాలు గ్రామపంచాయతీలు అన్నారు. 9 గంటల కరెంట్ పగటి పూట ఇస్తం అన్నరు. సిలిండర్  ధర తగ్గిస్తం అన్నరు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏమి కావలో చేసే నాయకుడు కేసీఆర్.


కళ్యాణ లక్ష్మీ, బీడీ కార్మికులకు పింఛన్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా.. ఇలా చెప్పనివి అనేకం అమలు చేశారు. కొల్లాపూర్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యం. పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించబోతున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా సస్యశామలం అవుతుంది. దళితులు, గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ నటిస్తున్నది. వారి వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్, చనిపోయిన తర్వాత కూడా భారతరత్న ఇవ్వని పార్టీ. బాబుజగజ్జీవన్ ప్రధాని కాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నది." అని హరీశ్ రావు అన్నారు. మహబూబ్ నగర్‌లో 14కు 14 గెలిచి చూపిద్దామని అన్నారు. 


Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!  


Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook