హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకింది. మంత్రి హరీష్ రావుకి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ( Minister Harish Rao tested positive for COVID-19) అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా ప్రకటించారు. కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ వచ్చిందని మంత్రి ట్వీట్ చేశారు. Also read : Telangana: కరోనా హెల్త్ బులెటిన్ విడుదల

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తన ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్న మంత్రి హరీష్ రావు.. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వాళ్లు కూడా కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయించుకుని ఎవరికి వారు ఐసోలేట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ( TRS MLAs tested positive for COVID-19 ) కరోనా సోకగా.. తాజాగా మంత్రి హరీష్ రావుకు కూడా కరోనా సోకడం టీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. Also read : Jagananna Vidya kanuka: జగనన్న విద్యా కానుక పథకం వాయిదా