Shashidhar Reddy Joins in BRS: తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే టికెట్లు ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఎక్కువగా అందరి దృష్టి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొంది. ఈ స్థానం నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పిన మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి తన కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన శాయశక్తుల కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆమె గెలుపు కోసం మంత్రి హరీష్ రావు వ్యహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి రప్పించారు. ఆయన హరీష్‌ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరని అన్నారు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవని స్పష్టం చేశారు. ప్రజల మీద ప్రేమ ఉండాలని.. ప్రజలకు సేవ చేయాలన్నారు. మెదక్ పుకార్లు తిప్పికొట్టి.. హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే పద్మ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇందిరా గాంధీ మాట తప్పారని.. కానీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మ వల్ల మెదక్ జిల్లా అయిందన్నారు. ఇక్కడికి మెడికల్ కాలేజీ వచ్చిందని.. రైల్ వచ్చిందన్నారు. 


"ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు. రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది కేసీఆర్‌. కరెంట్ నిరంతరం ఇస్తున్నారు. పండుగల వేళ ఎన్నికల పండగ వచ్చింది. రకరకాల వ్యక్తులు వస్తున్నారు. దండగ అన్న వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్. పెట్టుబడి నాడు రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు. 3 గంటలు ఇచ్చే వాళ్లు కావాలా..? 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా..?


ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదు. కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం. కిసాన్ సమ్మన్ నిధి, హర్ ఘాట్ జల్, కళ్యాణ లక్ష్మి, ముగ జీవాలకు అంబులెన్స్. కేంద్రం మనవి కాపీ కొట్టి అమలు చేస్తున్నది. నాడు బెంగాల్ ఉండేది. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి. పద్మ గారు గెలుపు.. మెదక్ అభివృద్ధికి మలుపు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలి." మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.


Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  


Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి