మేం ఎప్పుడూ ప్రజల పక్షమే, తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకే మహాధర్నా: మంత్రి హరీశ్
Minister HarishRao : తెలంగాణ రైతుల (Telangana farmers) పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా... తాము ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు.
Minister HarishRao says whether the TRS party is in opposition or in government, we always be on the side of the people: తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందంటూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ (TRS) మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో (Talasani Srinivas Yadav) కలిసి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతుల (Telangana farmers) పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా... తాము ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు.
Also Read : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్‌ను (Lower Sealer Power Plant) అన్యాయంగా ఆంధ్రాలో కలిపారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తెలంగాకు సంవత్సరానికి రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. ఏడు మండలాలను, లోయర్ సీలేరును ఆంధ్రాలో (ఆంధ్రా) కలిపిన నాడే కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా లక్షలాది మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ మహాధర్నా చేపట్టబోతున్నామని చెప్పారు.
పంజాబ్‌లో (Punjab) పండించే ప్రతి గింజను కొంటున్నారు... తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మాత్రం కొనడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ (Telangana) రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మహాధర్నా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
Also Read : ఎస్బీఐ నుంచి రూ. 2 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook