ఎస్బీఐ నుంచి రూ. 2 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్

ఎస్బీఐ రూపే కార్డ్ జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2018 ఆగస్టు 28వ తేదీ కంటే ముందుగా ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఈ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 04:38 PM IST
  • ఎస్బీఐ నుంచి ఉచితంగా రూ. 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్
  • ఎవరెవరు ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్‌కి అర్హులు ?
  • ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎలా ?
ఎస్బీఐ నుంచి రూ. 2 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్

ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చార్జీలు అధికం అవుతున్న ఈ రోజుల్లోనూ ఎస్బీఐ నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఇది నిజమే. ఎస్బీఐ తమ బ్యాంకులో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతా ఉన్న ఖాతాదారులకు ఉచితంగా రూ. 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆఫర్ అందిస్తోంది. ఎస్బీఐలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఉచితంగా పొందాలంటే మీరు చేయాల్సిందల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాను తెరవడమే. 

ఎస్బీఐ రూపే కార్డ్ జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2018 ఆగస్టు 28వ తేదీ కంటే ముందుగా ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఈ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది. అయితే జన్ ధన్ ఖాతా కలిగి ఉన్న వారికి 2 లక్షల రూపాయల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్ వర్తించనుండగా.. అంతకంటే ముందుగా ఖాతా తెరెచిన పాత కస్టమర్లకు లక్ష రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ కవర్ మాత్రమే పొందేందుకు అర్హులు అవుతారు.

Also read : PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎలా ?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం నింపడంతో పాటు ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్‌ని జత చేస్తూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా యాక్సిడెంట్‌కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నివేదిక), చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును జతచేయాల్సి ఉంటుంది. యాక్సిడెంట్ అయిన 90 రోజుల్లోపే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Also read : Amazon: అమెజాన్ అడ్డాగా మాదక ద్రవ్యాల సరఫరా, విచారణ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News