Minister KTR: ఆ ఐదుగురిని విడుదల చేయండి.. యూఏఈ రాయబారికి మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్
Minister KTR Meet With UAE Ambassador: యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురిని విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ఆయనను కేటీఆర్ కోరారు.
Minister KTR Meet With UAE Ambassador: దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్‌లో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు వివరాలను ఆయనకు మంత్రి అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని వివరించారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మృతి విషయంలో ప్రస్తుతం వీరు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.
'నేను 2103లోనే నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిశా. యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) 15 లక్షల రూపాయల పరిహారాన్ని స్వీకరించేందుకు వారు అంగీకరించారు. షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే శిక్ష అనుభవిస్తున్న వారిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బాధిత కుటుంబం నుంచి అన్ని పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందజేసింది.
వారిని విడుదల చేయాలని భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి నేనే స్వయంగా విజ్ఞప్తి చేశా. అయితే యూఏఈ కోర్టు క్షమాభిక్ష పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుంది..' అని మంత్రి కేటీఆర్ అబ్దుల్ నసీర్ అల్శాలికి చెప్పారు. వారిని విడుదల చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్థాయి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని.. భవిష్యత్‌లో నగర ముఖచిత్రం మరింతగా మారుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్, ఐటి, ఐటీ అనుబంధ రంగాల ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ పాలసీల గురించి యూఏఈ రాయబారికి కేటీఆర్ వివరించారు. తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్ట్ అప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని మంత్రికి అబ్దుల్ నసీర్ అల్శాలి హామీ ఇచ్చారు.
Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook