Minister KTR Explanation over his comments on AP: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఏపీ అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు వరుసపెట్టి కేటీఆర్‌కు కౌంటర్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అన్యాపదేశంగా నేను చేసిన కామెంట్ ఏపీలోని కొంతమంది నా మిత్రులకు తెలియకుండానే బాధ కలిగించి ఉండొచ్చు. ఏపీ సీఎం జగన్ గారిని నేను సోదర సమానుడిగా భావిస్తాను. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పురోగతి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.' అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు అర్ధరాత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


కాగా, శుక్రవారం (ఏప్రిల్ 29) క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన గురించి చెబుతూ కేటీఆర్ పొరుగు రాష్ట్రాల ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో నీళ్లు, కరెంట్, రోడ్లు సరిగా లేవని... పరిస్థితి అద్వాన్నంగా ఉందంటూ తనకు తెలిసిన మిత్రుడొకరు వాపోయారని చెప్పారు. తెలంగాణ గురించి తాను చెబుతున్నది అతిశయోక్తి అనిపిస్తే... ఒకసారి పక్క రాష్ట్రాలకు వెళ్లి చూసి రావాలన్నారు.


కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తొలుత వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను చూసి మురిసిపోతున్నారని... అసలు హైదరాబాద్‌కు కల్చర్ నేర్పిందే తామని పేర్కొన్నారు. ఇదే అంశంపై స్పందించిన పెద్దిరెడ్డి... ఓట్ల కోసమే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చునని కౌంటర్ ఇచ్చారు. మంత్రులు బొత్స, జోగి రమేష్ ఇలా తదితరులు వరుసపెట్టి కౌంటర్స్ ఇవ్వడంతో కేటీఆర్ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చుకోక తప్పలేదు. 



Also Read: KTR on Andhra Pradesh : పక్క రాష్ట్రంలో పరిస్థితి అద్వాన్నం.. ఏపీపై మంత్రి కేటీఆర్ పరోక్ష కామెంట్స్...


Also Read: Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook