/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Ktr Hot Comments: తెలుగు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం ఉందని ఇంతవరకు టాక్. ఏపీ సీఎం జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్నోసార్లు ఓపెన్ గానే పొగిడారు. అసెంబ్లీలోనూ కేసీఆర్ ను కీర్తిస్తూ ప్రసంగం చేశారు జగన్. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ తన మిత్రుడని చెప్పారు. జగన్ కు మద్దతుగా చాలా మాట్లాడారు. అయితే కొన్ని రోజులుగా ఇద్దరు తెలుగు సీఎంల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. తాజాగా జరిగిన పరిణామాలతో అదే నిజమేనని తెలుస్తోంది. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ కామెంట్లు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి.

క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాపర్టీ షోకు హాజరైన కేటీఆర్.. తెలంగాణ పురోగతిని వివరించారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ పరోక్షంగా ఏపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు కేటీఆర్. ఏపీలో కరెంట్ కొరత తీవ్రంగా ఉందని.. నీళ్లు లేవని, రోడ్లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని.. ఏపీకి వెళ్లి వచ్చిన తన మిత్రులు చెప్పారని కేటీఆర్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నరకం అనుభవించాల్సి వస్తుందని తన ఫ్రెండ్స్ చెప్పారని కూడా చెప్పారు కేటీఆర్. తాను చెప్పిన విషయాలన్ని నిజమేనని.. కావాలంటే అక్కడికి వెళ్లి పరిస్థితి స్వయంగా చూసి రావచ్చని కూడా కేటీఆర్ అన్నారు. ఏపీలో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ , రోడ్లు , మౌలిక సదుపాయాలు బాగున్నాయని కేటీఆర్ తెలిపారు.

ఏపీలో దారుణంగా ఉందంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఏపీలో రచ్చగా మారాయి. జగన్ పాలనలో ఏపీ పరువు పోతుందని, పక్క రాష్ట్రాల నేతలు అవహేళన చేసే స్థాయికి వచ్చిందని  విపక్షాలు మండిపడుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారడంతో వైసీపీ నేతలు వెంటనే  స్పందించారు. కేటీఆర్ మాటలకు కౌంటరిచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో కరెంట్ కొరత తీవ్రంగా ఉందన్నారు. తాను హైదరాబాద్ లో ఉండి వచ్చానని, జనరేటర్ పెట్టుకుని ఉన్నానని బొత్స తెలిపారు. తన మిత్రులు చెప్పిందో చెబుతున్నానని కేటీఆర్ చెప్పారని.. కాని తాను స్వయంగా హైదరాబాద్ లో ఉంది పరిస్థితి చూసి వచ్చానన్నారు బొత్స సత్యనారాయణ. ఎవరి ఘనత వాళ్లు చెప్పుకోవడంలో తప్పు లేదు కాని.. ఇతర విషయాల్లో మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని బొత్స ప్రశ్నించారు. ఏపీపై చేసిన కామెంట్లను కేటీఆర్ వెనక్కి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు.

మొత్తంగా కేటీఆర్ కామెంట్లు, ఏపీ మంత్రి బొత్స కౌంటర్ తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

READ ALSO: Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్...

Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Ap Minister Bothsa Satyanarayana Counter To Ktr Comments
News Source: 
Home Title: 

Ktr Hot Comments:కొన్ని రోజులుగా ఇద్దరు తెలుగు సీఎంల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. తాజాగా జరిగిన పరిణామాలతో అదే నిజమేనని తెలుస్తోంది. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ కామెంట్లు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి.

Ktr Hot Comments: తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ.. కేటీఆర్ కు బొత్స కౌంటర్
Caption: 
FILE PHOTO
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్న కేటీఆర్

కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నం- కేటీఆర్

హైదరాబాద్ లో కరెంట్ కోతలంటూ బొత్స కౌంటర్

Mobile Title: 
Ktr Hot Comments On Ap: తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ.. కేటీఆర్ కు బొత్స కౌంటర్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, April 29, 2022 - 16:04
Reported By: 
ZH Telugu Desk
Request Count: 
53
Is Breaking News: 
No