Minister KTR In London: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు లండన్‌లో ఘన స్వాగతం లభించింది. టీఆర్‌ఎస్‌ విభాగంతో పాటు.. ఎన్నారై సంఘాల ప్రతినిధులు ఆయనకు లండన్‌ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. కొందరు కుటుంబసభ్యులతో సహా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కేటీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు వందలాది మంది ఆయనకు స్వాగతం చెప్పేందుకు తరలిరావడంతో విమానాశ్రయం వద్ద కోలాహలం నెలకొంది. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్‌కి అధికారికంగా స్వాగతం పలికారు. పలు రంగాల ప్రతినిధులు, ఆయా కంపెనీలకు చెందిన అధికారులతో కేటీఆర్‌ సమావేశం కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. బ్రిటన్‌, దావోస్‌లో పదిరోజులపాటు కేటీఆర్‌ పర్యటించనున్నారు. యూకేలో నాలుగు రోజులు ఆయన పర్యటన కొనసాగుతుంది. లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీకానున్నారు. 


బ్రిటన్‌ పర్యటన తర్వాత కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆరు రోజుల పాటు కేటీఆర్‌ పర్యటన కొనసాగుతుంది. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు. ఆ సదస్సులో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో  సామాన్యులకు మెరుగైన సేవలు ఎలా అందుతాయన్న అంశంపై కేటీఆర్‌ ప్రసంగిస్తారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయా దేశాలకు చెందిన అధికారులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. ఈనెల 26వ తేదీన తిరిగి కేటీఆర్‌ రాష్ట్రానికి తిరిగి వస్తారు.


Also Read: Cholesterol control Food: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి..గుండె ఫిట్‌గా ఉంటుంది..!!


Also Read:lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook