Daifuku and Nicomac Taikisha in Ranga Reddy: రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో Daifuku Intralogistics India’s, Nicomac Taikisha కంపెనీల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జపాన్‌కి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తామన్నారు. జపాన్ దేశం అతి తక్కువ సహజ వనరులు అందుబాటులో ఉన్న అద్భుతమైన దేశంగా ఎదిగిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినా ఎదుర్కొని జపాన్ నిలబడుతోందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక జపాన్ ఉత్పత్తి ఉంటుందన్నారు. ఈరోజు తమ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ రెండు కంపెనీలు కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విజయం సాధిస్తాయని నమ్ముతున్నట్లు చెప్పారు. రూ. 575 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్ష 1600 ఉద్యోగాలు ఇస్తున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇక్కడ స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ ఇచ్చాయన్నారు. 


ఈ కంపెనీలలో వచ్చే ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను కూడా అందించనున్నాయని చెప్పారు. చందన్వెళ్లి పారిశ్రామిక పార్కు కోసం స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారం వల్లనే పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయన్నారు. టెక్స్‌టైల్ నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాలు దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయన్నారు.  


అంతర్జాతీయంగా పేరు కలిగిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందన్వెల్లి ఎదుగుతోందన్నారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఇందుకు అవసరమైన సహకారాలను జపాన్ కాన్సులేట్ నుంచి ఇవ్వాలని కోరారు. చందన్వెల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో ఈ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇంతే ప్రభావవంతమైన తమ ప్రభుత్వ పనితీరును కొనసాగిస్తామని చెప్పారు.


Also Read: Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు  


Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి