Government Jobs In Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ అయిన పోస్టుల వివరాలతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. www.telanganajobstats.in అనే వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ నేడు ఆరంభించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర యువతను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నామని ఆయన అన్నారు. తాము హామీ ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపునకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచనట్లు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 9.5 సంవత్సరాలలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను లక్షా 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతున్న యువకులతో సుదీర్ఘంగా చర్చించిన కేటీఆర్.. వారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ముఖ్యంగా యువకులకు అందుబాటులో ఉండేలా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. భారీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పలు రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంతో యువతలో అపోహలు నెలకొన్నాయని వారు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. 


నిన్న జరిగిన చర్చలో వారికి మంత్రి కేటీఆర్ ప్రభుత్వ అధికారిక లెక్కలతో కూడిన వివరాలను అందించారు. కేటీఆర్ అందించిన సమాచారం పట్ల సంతృప్తి చెందిన వారు వీటన్నింటిని రాష్ట్ర యువతకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈరోజు ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిల్ ఏర్పాటు వంటి అంశాలపైన వివరాలు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కేటీఆర్ కోరారు. www.telanganajobstats.in లో అన్నీ వివరాలు ఉంచినట్లు చెప్పారు.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook