Minister KTR press meet KTR reacting criticism on Rythu Bandhu scheme : రైతుబంధు ప‌థ‌కం కేసీఆర్ మాన‌స‌పుత్రిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, (TRS Party Working President) మంత్రి కేటీఆర్ (KTR) ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కొందరు పొలిటిక‌ల్ టూరిస్ట్స్‌ రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ప‌థ‌కంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రైతుబంధు సంబురాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నార‌ని మంత్రి తెలిపారు. రైతుబంధు రూపంలో 64 ల‌క్ష‌ల మంది రైతులకు (64 lakh farmers) రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డి సాయంగా అందించామని చెప్పుకొచ్చారు కేటీఆర్. వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లోనే ఇది సువ‌ర్ణ అధ్యాయమని మంత్రి చెప్పారు.


తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్, (Congress) బీజేపీ (BJP) నాయ‌కులు గంద‌ర‌గోళ ప‌రుస్తున్నారంటూ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టామ‌ని చెప్పారు. తాను తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా బీజేపీ, కాంగ్రెస్‌లకు స‌వాల్ విసురుతున్నానని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు ఎంత మేలు చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. శ్వేత‌ప‌త్రాల్లో పోటీ ప‌డుదామన్నారు. ద‌మ్ముంటే రైతుల‌కు ఏం చేశారో చెప్పడంటూ కేటీఆర్ మండిపడ్డారు. 


తమ ప్రభుత్వం నాలుగు లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. మిగతా రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తామ‌న్నారు. రైతు బీమా పథకంతో రైతులకు కేసీఆర్ అన్నగా మారారని చెప్పారు. రైతు బీమాకు తమ ప్రభుత్వం రూ. 3205 కోట్ల మేర ప్రీమియం (Premium) కట్టిందని తెలిపారు. 70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం చేకూరిందన్నారు.



 


Also Read : Viral Video: సముద్రంలో జారిపడిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు


కేంద్రం నుంచి ఒక్కపైసా సాయం లేకున్నా కూడా తామే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామ‌ని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు రైతులు అనేక కష్టాలు పడేవారని గుర్తు చేశారు కేటీఆర్. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. అయితే అప్పటి పాలనలో రైతుల స్టాట‌ర్లు లాక్కొనిపోయే పరిస్థితులు కూడా ఉండేవని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి మారిపోయాయన్నారు.ఇక తెలంగాణ (Telangana) రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌ని కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ఐదు విప్ల‌వాలు అద్భుతంగా అమలు అవుతున్నాయన్నారు. వ్యవసాయ విప్లవం, (Agriculture) సస్య విప్లవం, గులాబీ విప్లవం‌‌ - పశు సంపద అభివృద్ధి, నీలి విప్లవం, శ్వేత విప్లవం అమలు చేస్తున్నామని చెప్పారు. 


Also Read : AP Night Curfew: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూ, విద్యాలయాల మూసివేతపై..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి