Viral Video: సముద్రంలో జారిపడిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

Viral Video: ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో పడిపోయిన ఓ మహిళను ముంబయి మెరైన్ పోలీసులు రక్షించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్‌లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది కుదుపులకు గురైంది. దీంతో పట్టుతప్పిన ఒక మహిళ సముద్రంలో పడిపోయింది. ఈత రాక నీటిలో మునిగిపోతూ ఇబ్బంది పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 02:36 PM IST
Viral Video: సముద్రంలో జారిపడిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

Viral Video: మహారాష్ట్రలోని ముంబయిలో ప్రమాదవశాత్తు సముద్రపు నీటిలో పడిపోయిన యువతిని తీర ప్రాంత పోలీసులు రక్షించారు. టూరింగ్ బోటులో సముద్రంలోకి వెళ్లిన ఆమె పొరపాటును జారి సముద్రంలో పడిపోయింది. గజ ఈతగాళ్లు సహాయంతో ముంబయి తీర ప్రాంత పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఏం జరిగిందంటే?

ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్‌లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది కుదుపులకు గురైంది. దీంతో పట్టుతప్పిన ఒక మహిళ సముద్రంలో పడిపోయింది. ఈత రాక నీటిలో మునిగిపోతూ ఇబ్బంది పడింది. 

సమాచారం అందుకున్న ముంబయి కోస్టల్, మెరైన్ పోలీసులు ఆ మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగారు. లైఫ్‌ జాకెట్‌ ఆసరాతో ఉన్న ఆమె వద్దకు ఇద్దరు గజ ఈత గాళ్లు చేరి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో తీర ప్రాంత పోలీసుల బృందం ఒక బోటులో ఆ మహిళ సమీపానికి చేరుకుంది. 

తాడు సాయంతో యువతిని.. బోటులోకి లాగి ఆమెను కాపాడారు. తీర ప్రాంత పోలీసులు సకాలంలో చేరుకొని నీటి నుంచి మహిళను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియోను ముంబయి పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఇప్పుడా వీడియో వైరల్‌ అయ్యింది. 

Also Read: Google Chrome Update: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి! లేదంటే ఇక అంతే..

Also Read: Sapna Choudhary: స్వప్న చౌదరి డ్యాన్స్ చూసి ముసలి తాతకు కూడా మూడొచ్చింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News