Minister KTR Sensational Allegations On Etala Rajender and TPCC president Revanth Reddy: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన హైటెక్స్ ప్రాంగ‌ణంలో ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి, (Revanth Reddy) ఈటల రాజేందర్‌ (Etala Rajender) రహస్యంగా కలిశారన్నారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ (KTR) తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలు తిప్పి కొడతారని కేటీఆర్ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం అతిగా స్పందిస్తోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. హుజూరాబాద్ ఎన్నికల్లో (huzurabad by election) టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ (gellu srinivas yadav) గెలుస్తారు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో పోటీ చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. 


Also Read : Samantha Char Dham Yatra : ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్ర


గ‌తంలో క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ లోక్‌స‌భ ఎన్నిక‌లతో పాటు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో చీక‌టి ఒప్పందం చేసుకున్న‌ట్టే.. ఇవాళ హుజూరాబాద్‌లో కాంగ్రెస్, (Congress) బీజేపీ (BJP) కుమ్మ‌క్క‌య్యాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గురివింద గింజ సామెత‌ను గుర్తు చేసుకోవాల‌న్నారు. రేవంత్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajender) లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మాణిక్యం ఠాకూర్ రూ. 50 కోట్లకు పీసీసీ (PCC) పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదని కేటీఆర్ (KTR) అన్నారు.


Also Read : Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్ ట్రెక్కింగ్ విషాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook