Himanshu Rao Kalvakuntla: తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు, వారు ఎదిగి ప్రయోజకులు అవుతున్నప్పుడే అసలైన పుత్రోత్సాహం, పత్రికోత్సాహం ఉంటుంది. తాజాగా కుమారుడు సాధించిన ఘనతపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉప్పొంగిపోతున్నారు. అది సైతం అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం మామాలూ విషయం కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నాడు. డయానా అంతర్జాతీయ అవార్డుకు కేటీఆర్ (Telangana IT Minister KTR) తనయుడు హిమాన్షు రావును ఎంపిక చేశారు. బ్రిటన్‌లోని తెస్సి ఒజో సీబీఈ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాకుమారి డయానా పేరిట ఓ ఇవార్డును అందిస్తోంది. సామాజిక సేవలు అందించే 9 నుంచి 25 ఏళ్ల లోపు వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఈ క్రమంలో హిమాన్షు రావు(15)ను ఈ ఏడాది డయానా అవార్డు వరించింది.


Also Read: TS Inter 2nd Year Results 2021 Direct Link: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ మీకోసం



తాత, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నియోజకవర్గంలోని రెండు గ్రామాల స్వయం సమృద్ధికి హిమాన్షు రావు శోమ అనే పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకుగానూ డయానా అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. వర్చువల్ ప్రోగ్రామ్‌లో ఈ అవార్డును అందుకున్నాడు. కుమారుడికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో హిమాన్షుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. నానమ్మ, తల్లి పేర్లలోని అక్షరాలతో హిమాన్షు రావు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే.


Also Read: Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి, ఆయనకు కలిసొచ్చిన అంశాలివే.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook