Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి, ఆయనకు కలిసొచ్చిన అంశాలివే.. 

TPCC Chief Revanth Reddy: గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 27, 2021, 09:55 AM IST
Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి, ఆయనకు కలిసొచ్చిన అంశాలివే.. 

TPCC Chief Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు షాకిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. కేవలం మూడున్నరేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేత అయినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంటి నేతలతో పోటీపడి టీపీసీసీ అధ్యక్షుడిగా నిలిచారు.

గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కీలక నేతలతో చర్చించి సమాచారం, అభిప్రాయాలు సేకరించారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు, పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటి కారణాలతో టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ముందుకు సాగాలంటే వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత అయినా రేవంత్ రెడ్డి (Congress MP Revanth Reddy) వైపు అధిష్టాన మొగ్గు చూపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాల్కాజిగిరి స్థానం నుంచి విజయం సాధించారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను దీటుగా ఎదుర్కొన్న నేతగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.

Also Read: Huzurabad bypolls: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కే నా మద్దతు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేసిన రేవంత్ రెడ్డి అంచెంలంచెలుగా ఎదిగారు. ఆపై ఉమ్మడి ఏపీలో స్థానిక సంస్థల అభ్యర్థిగా ఎమ్మెల్సీ అయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు 2009, 2014లలో టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిణామాలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో విజయం సాధించింది, కానీ ఫిరాయింపులతో చివరికి కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు మిగిలారు. వరుస ఎన్నికల్లో డీలా పడుతున్న Telangana కాంగ్రెస్ పార్టీకి దూకుడును జత చేయాలంటే రేవంత్ రెడ్డి సరైన నేత అని పార్టీకి చెందిన ఓ వర్గం నేతలు సైతం భావించారు.

Also Read: Mobile COVID-19 vaccines vans: ఇక పని చేసే చోటికే మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్లు

2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే డీలాపడిన కాంగ్రెస్ శ్రేణులలో నూతనోత్సాహాన్ని పెంపొందించాలంటే వాక్ చాతుర్యం గల రేవంత్ రెడ్డి లాంటి దూకుడు ఉన్న నేత కావాలని పార్టీ పెద్దలు భావించారు. టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకుని పార్టీని ముందుకు నడిపించాలంటే పదునైన విమర్శలు చేయడంతో పాటు బలమైన నాయకత్వం కావాలన్న తరుణంలో ఇతనే సరైన వ్యక్తి అని పార్టీ సీనియర్ నేతలను ఒప్పించేందుకు సైతం అధిష్టానానికి కాస్త సమయం పట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ కార్యవర్గంలో సైతం చోటు ఇవ్వొద్దని పార్టీ నేతలు సూచించినా బుజ్జగింపులు చేసి అధికారం దక్కాలంటే సరైన మార్గదర్శకత్వం, నాయకత్వం కావాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News