Mallareddy on CM KCR: కేసీఆర్ ప్రధాని కావాలని మేడారంలో మంత్రి మల్లారెడ్డి మొక్కు..
Mallareddy on CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మలను మొక్కుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Minister Mallareddy on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మలను మొక్కుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ లాగే దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని అన్నారు. గతంలో తాను ఎంపీ కావాలని, మంత్రి కావాలని మొక్కుకున్నానని... వన దేవతలు తన మొక్కులు తీర్చారని మల్లారెడ్డి అన్నారు. ఈసారి సీఎం కేసీఆర్ కోసం మొక్కుకున్న మొక్కును కూడా వన దేవతలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న వేళ.. భవిష్యత్తులో ఆయన ప్రధాని కావాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. గురువారం (ఫిబ్రవరి 17) కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతామని.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామని ఇటీవల కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడుతానని చెప్పారు. రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి.. కేంద్రంపై ఆయన ఫైట్‌ను అభినందించారు. ఈ నెల 20న ఈ ఇద్దరు సీఎంలు ముంబైలో భేటీ కానున్నారు. అంతకుముందు, మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేంద్రంపై కేసీఆర్ ఫైట్‌కు పూర్తి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్‌లు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు, తనయుడిని సీఎం చేసేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Also Read: Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు అక్కడికక్కడే మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook