Minister ponguleti comments on brs party:  తెలంగాణలో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా మారిందని చెప్పుకొవచ్చు.  ఇదిలా ఉండగా.. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  బీఆర్ఎస్ ను ఒక వైపు టార్గెట్ చేస్తునే, మరోవైపు మరోవైపు ఎన్నికలలో ఇచ్చిన హమీలను అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఒక వైపు తెలంగాణలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారంలో పాటు, హైడ్రాపై కూడా రచ్చ నడుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ క్రమంలో తాజాగా, మంత్రి సౌత్ కోరియాలోని సియోల్  నుంచి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. దీపావళికి ముందు తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయన్నారు. అంతే కాకుండా.. బీఆర్ఎస్ పార్టీకీ చెందిన కీలక నేతలు అరెస్ట్ అవుతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 



పూర్తి వివరాలు..


తెలంగాణ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణలో  ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి అంశాలపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చగా మారాయి. ప్రస్తుతం మంత్రి సౌత్ కోరియా.. పర్యటనలో ఉన్నరు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణిలో వంటి అంశాలపై దర్యాప్తు కీలక దశలో చేరుకుందన్నారు.


అంతే కాకుండా.. దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ కు చెందని కీలక నేతలు అరెస్ట్ అవుతారని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా..  తాము కేవలం ఆరోపణలు చేయడంలేదని, ఆధారాలతో సహా ప్రజల ముందు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఉంచుతామని కూడా పొంగులేటీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌


పొంగులేటీ సౌత్ కొరియాలోని సియోల్ నుంచి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తెలంగాణాలో మాత్రం మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయని చెప్పుకొవచ్చు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.