Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు..
Minister Srinivas Goud murder conspiracy case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈకేసులో కీలక నిందితులను కస్టడీకి తీసుకున్నారు.
Minister Srinivas Goud murder conspiracy case: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) హత్య కుట్ర కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఏడుగురు నిందితులను కస్టడీకి (Police Custody) తీసుకున్నారు. వీరిని మొదట చర్లపల్లి జైలు నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఈకేసులో నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టనున్నారు. నిందితుల (Accused persons) నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చారు? రూ.15 కోట్లు ఎలా సమకూర్చుకున్నారనే విషయాలపై వివరాలను రాబట్టనున్నారు.
నిందితుల్లో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపాను పోలీసులు అరెస్టు చేయగా.. సొంత పూచీకత్తుపై అతడు బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. మిగతా ఏడుగురు నిందితులను ఇవాళ్టి నుంచి ఈనెల 13 వరకు పోలీసులు విచారించనున్నారు. ఈ కుట్ర కేసులో కీలక వ్యక్తుల ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని ఇదివరకే మేడ్చల్ కోర్టు స్పష్టం చేసింది. విచారణను వీడియోగ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ కస్టడీకి ముందు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. ప్రస్తుతం మంత్రికి గ్రే హౌండ్స్ భద్రత కల్పించనున్నారు.
Also Read: Minister Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. మంత్రి ఫస్ట్ రియాక్షన్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook