మైనర్పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మార్పు రావడం లేదు. రోజురోజుకూ బాలికలు, యువుతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ దాడులకు తెగబడుతున్నారు.
శంషాబాద్: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మార్పు రావడం లేదు. రోజురోజుకూ బాలికలు, యువుతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చారినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలికపై హరి అనే స్థానిక యువకుడు గత కొంతకాలం నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
లైంగిక దాడులు జరుగుతున్న క్రమంలో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. కూతురు గర్భవతి అని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం తమ కూతురు ఐదు నెలల గర్భవతి అని, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడుల ఘటనను బాలల హక్కుల సంఘం ఖండించింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: వివాహ వేడుకకు హాజరై వెళ్తుండగా విషాదం
మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి