TS Inter Results 2022: 2019లో వచ్చిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. సాఫ్ట్ వేర్ లోపంతో పాసైన వాళ్లను ఫెయిల్ గా చూపించింది. ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని తెలియడంతో తట్టుకోలేక వందలాది మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని సబెక్టులతో టాప్ మార్కులు వచ్చి.. కొన్ని సబ్జెక్టులలో జీరో మార్కులు వచ్చాయి. ఫలితాల్లో సాఫ్ట్ వేర్ లోపంతో తప్పులు దొర్లాయని తర్వాత ఇంటర్ బోర్జు కూడా  అంగీకరించింది. కాని అప్పటికే జరగాల్సిన దారుణాలు జరిగిపోయాయి. వందలాది మంది విద్యార్థులు బలై పోయారు. ఈ ఘటన అప్పడు తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. 2019లో జరిగిన తప్పులతో తీవ్ర అనర్థం జరిగినా తెలంగాణ ఇంటర్ బోర్డు తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. తాజాగా విడుదలై 2022 ఇంటర్ ఫలితాల్లోనూ తప్పులు దొర్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు బలమైన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక తప్పులు కనిపిస్తున్నాయి. కొందరు టాప్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారు. కొందరు విద్యార్థులకు టాప్ మార్కులు వచ్చినా ఒక సబ్టెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇతర సబ్జెక్టులలో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థికి ఒక సబ్జెక్ట్ లో సున్నా మార్కులు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీలో చదివిన బద్రి గోపి సెకండియర్ లో ఇంగ్లీషులో 70, తెలుగులో 90, హిస్టరీలో 93, సివిక్స్ లో 80 మార్కులు సాధించాడు.ఎకనామిక్స్ లో మాత్రం గోపికి సున్నా మార్కులు వచ్చాయి. ఫలితం చూసిన గోపితో పాటు కాలేజీ అద్యాపకులు షాకయ్యారు. ఫలితాల్లో తప్పిదం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఎక్కడో పొరపాటు జరిగిందని, ఆందోళన చెందవద్దని గోపికి లెక్చరర్లు ధైర్యం చెప్పారు. రీ వాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బద్రి గోపి ఘటన పై ఇంటర్ బోర్డు అధికారులు ఆరా తీశారని తెలుస్తోంది.


మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో  చదివిన హరికిషన్‌ అనే బైసీపీ రెండో సంవత్సరం విద్యారికి  సంస్కృతంలో సున్నా మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఇంగ్లీషులో అతనికి 50 మార్కులు వచ్చాయి. ఆంగ్లంలో మంచి మార్కులు స్కోర్ చేసి.. సంస్కృతంలో సున్నా మార్కులు రావడంతో తప్పిదం జరిగిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో 50 మార్కులు వచ్చిన విద్యార్థికి సంస్కృతంలో జీరో మార్కులు ఎలా వస్తాయని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హరికిషన్, గోపి లానే చాలా మంది విద్యార్థులకు సున్నా మార్కులు వచ్చినట్లుగా ఫలితాల్లో ఉందని సమాచారం. దీంతో 2019 లానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో సాఫ్ట్ వేర్ లోపం ఉందనే అనుమానాలు వస్తున్నాయి.


ఇంటర్‌ బోర్డు తప్పిదాలతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫలితాల వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఇంటర్ ఫలితాలపై వస్తున్న ఆరోపణలపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పందించారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసేందుకు మార్కులను డబుల్‌ చెక్‌ చేశామని చెప్పారు.  అందుకే ఫలితాల విడుదలకు రెండు మూడు రోజులు లేట్ అయిందన్నారు. తప్పులు రాకుండా చూడటానికే ఒక రిటైర్డ్ అధికారిని గత మూడేళ్లుగా ఓఎస్‌డీగా నియమించుకున్నారు. అయినా ఫలితాల్లో తప్పులు రావడంతో ఆందోళన కల్గిస్తోంది. ఇంటర్ ఫలితాలపై లోతుగా విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Read also: Udaipur  Beheaded Case: ఐదు రోజుల క్రితమే రక్షణ కోరిన టైలర్.. పట్టించుకోని పోలీసులు! ఉదయపూర్ హత్య కేసులో సంచలనం..  


Read also: Telangana Rains: దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు అలర్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి