MLA Defection Case: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగష్టు లో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కేసులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేగా అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో 2023  చివర్లో జరిగిన ఎలక్షన్స్ లో  అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి  కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అంతేకాదు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని పవర్ లోకి  తీసుకొచ్చిన రేవంత్ నే అధిష్ఠానం సీఎం ను చేసింది.  అంతేకాదు పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లూప్ హోల్స్ ను పట్టుకొని వాళ్లను తన పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు.


గతంలో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను విమర్శించిన ప్రస్తుతం సీఎం.. అదే ఆపరేషన్ ఆకర్ష్ కు సరికొత్తగా అమలు చేసే పనిలో పడ్డాడు. అయితే కేసీఆర్ మాదిరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 2/3 వంతు మందిని చీల్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఈ నేపథ్మంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కడియం శ్రీహరి,  దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు సహా పలువురు ఎమ్మెల్యేగా పార్టీ మారారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన కౌశిక్ రెడ్డి, వివేకానంద కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
 
తాజాగా పార్టీ మారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పై నాలుగు వారాల్లోకా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హై కోర్టు. మొత్తంగా హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పాలి.


గత ఎన్నికల్లో కడియం కూతరు శ్రీహరి వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ గెలిచారు.  అటు దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  అయితే.. ఈ ముగ్గురుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.