BJP Mla Raja Singh: దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజాసింగ్‌పై కేసులు నమోదు అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తప్పించారు. రాజాసింగ్ వీడియోపై మైనార్టీల ఆందోళనలు నిర్వహించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూట్యూబ్‌ నుంచి వీడియోను తొలగించారు.దీనిపై దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ హైకమాండ్..రాజాసింగ్‌పై వేటు వేసింది. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ పార్టీకి చెందిన నుపుర్ శర్మ..మహ్మద్ ప్రవక్తకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 


దీనిపై పెను దుమారం రేగింది. ఆ వీడియోను టాగ్ చేసిన వ్యక్తులు సైతం హత్యకు గురైయ్యారు. ఈక్రమంలో నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. నుపుర్ శర్మ తీరుపై సుప్రీంకోర్టు సైతం సీరియస్ అయ్యింది. ప్రశాంతంగా ఉన్న దేశంలో విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ హెచ్చరించింది. దేశ మొత్తానికి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ఆమెపై దేశవ్యాప్తంగా పలు స్టేషనల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. 


[[{"fid":"242576","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:TARGET KTR: ఫీనిక్స్ తో కేటీఆర్ ఫినిష్! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ.. గులాబీ పార్టీలో కలవరం


Also read:Bandi Sanjay: లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉంది..వెంటనే సస్పెండ్ చేయాలన్న బండి సంజయ్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి