Bandi Sanjay: లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉంది..వెంటనే సస్పెండ్ చేయాలన్న బండి సంజయ్..!

Bandi Sanjay: తెలంగాణలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 

Written by - Alla Swamy | Last Updated : Aug 23, 2022, 02:54 PM IST
  • హాట్‌హాట్‌గా తెలంగాణ పాలిటిక్స్
  • టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • బండిసంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉంది..వెంటనే సస్పెండ్ చేయాలన్న బండి సంజయ్..!

Bandi Sanjay: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పాదయాత్రపై దాడి చేస్తే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దేవరుప్పల, అలంపూర్‌లో యాత్రను టీఆర్ఎస్ గూండాలు అడ్డుకుంటే స్థానిక యువత తిరగబడిందని గుర్తు చేశారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. డబ్బులు ఇచ్చి సభకు పిలిపించినా స్పందన లేదన్నారు. 

సీఎం కేసీఆర్‌కు మూడిందన్నారు బండి సంజయ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా పోలీస్ అనుమతితో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నామన్నారు. గత 21 రోజులుగా ప్రశాంతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని చెప్పారు. తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

వేల కోట్ల అవినీతి సొమ్మును సీఎం కేసీఆర్ కూడబెట్టారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. స్కాం బయటకు రాకుండా దారి మళ్లించేందుకు పాదయాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన కూతుర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్‌ నేతలు ఎన్ని దాడులు చేసినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఎక్కడైతే పాదయాత్రను అడ్డుకున్నారో..అక్కడే నుంచే మళ్లీ మొదలు పెడతామన్నారు. భద్రకాళి అమ్మవారి గుడి వరకు కచ్చితంగా పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సభను భారీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు బీజేపీ పెద్దలు వస్తారని తెలిపారు బండి సంజయ్. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు నేతలు పాల్గొంటారని వెల్లడించారు. 

ప్రజల్లోకి వెళ్తే టీఆర్ఎస్‌ పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేద్దామని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో లిక్కర్ స్కామ్‌లో సీఎం కుటుంబ అవినీతి బయట పడుతుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ వణికిపోతున్నారని విమర్శించారు. ఈస్కామ్‌లో కాంగ్రెస్ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై లోతుగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 

Also read:TRS VS BJP: బీజేపీ నేతల్లారా ఇండ్లలో చెప్పి బయటికి రండి! టీఆర్ఎస్ మంత్రుల వార్నింగ్

Also read:TARGET KTR: ఫీనిక్స్ తో కేటీఆర్ ఫినిష్! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ.. గులాబీ పార్టీలో కలవరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News