'కరోనా వైరస్'..కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పేద వారికి పట్టెడన్నం దొరకని పరిస్థితి నెలకొంది.  పట్టణపేదలకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు ఆహారం లేదా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల పరిస్థితి ఏంటి..? అడవితల్లి బిడ్డలు ఆకలికి అలమటించే పరిస్థితి ఉండకూడదని ములుగు ఎమ్మెల్యే సీతక్క తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ వారికి నిత్యావసర  వస్తువులు, బియ్యం, కూరగాయలు అందిస్తూ ఆదుకుంటున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 


ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క మరో ముందడుగు వేశారు. పేద వారి ఆకలి తీర్చేందుకు సరికొత్త ఛాలెంజ్ తో ముందుకొచ్చారు. #GoHungerGo పేరుతో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా .. ఉపాధి కోల్పయిన పేదవారికి నిత్యావసర సరుకులు అందించాలని సోషల్ మీడియా మిత్రులను కోరారు. అలాగే సరికొత్త ఛాలెంజ్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఎంపీ రేవంత్ రెడ్డికి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి విసిరారు. ఆకలిపై యుద్ధం చేద్దామని ఆమె పేర్కొన్నారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..