Mlc Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానుండటం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు బంజరాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కవితను సీబీఐ ఏం ప్రశ్నిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన కవిత... సీబీఐ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది.. ఎలా సమాధానం చెప్పాలనే విషయాలపై ప్రిపేర్ అయినట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు వాహనాల్లో 11 మంది సీబీఐ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. సీబీఐ బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. అమిత్ ఆరోరా స్టేమ్‌మెంట్ ఆధారంగా కవితను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. కవిత ఇంట్లో సీబీఐ విచారణకు ఓ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కవితను నుంచి సీబీఐ అధికారులు వివరాలు తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ కవిత పది ఫోన్లను ధ్వంసం చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో కవిత విచారణ ఎలా సాగనుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొనగా.. వ్యక్తిగత పనుల వల్ల 6వ తేదీన విచారణకు అందుబాటులో ఉండనని కవిత సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆమె అభ్యర్థన మేరకు ఈ నెల 11వ తేదీన విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ కోరింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డు చేస్తున్నారు. 


సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. స్పెషల్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. బయటవారిని ఎవ్వరినీ ఇంటి వద్దకు అనుమతించడం లేదు. దీంతో నిత్యం పార్టీ అనుచరులతో సందడిగా కనిపించే కవిత నివాసం.. అక్కడి రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. కవిత ఇంటి వద్ద కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కవిత ఇంటి దగ్గరకు ఎవరూ రావొద్దని పార్టీ పెద్దల నుంచి కేడర్‌కు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అందుకే కవిత నివాసం దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు.  


Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook