GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి..ధన ప్రవాహం ప్రారంభమైంది. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నగదు పంపిణీ మొదలెట్టారు. ఈసీకు దొరకకుండా ఉండేందుకు గూగుల్ పే, ఫోన్ పే విధానాన్ని ఎంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ( Greater Hyderabad Elections ) ల్లో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాయి రాజకీయపార్టీలు. నువ్వా నేనా రీతిలో సాగిన  ప్రచార పర్వం ముగిసింది. ఇక మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక అసలైన ధన ప్రవాహం ప్రారంభమైంది. ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు ఏకంగా 5 వేల వరకూ ఇస్తున్నారు. అయితే పోలీసులు, ఈసీ కంటపడకుండా ఉండేందుకు కొత్త విధానాన్ని ఆశ్రయించారు. డిజిటల్ పేమెంట్ ను అనుసరిస్తున్నారు.


వాస్తవానికి డిజిటల్ టెక్నాలజీ ( Digital technology ) విధానాన్ని ఎన్నికల్లో డబ్బుల పంపిణీకు వాడటం ఇదే తొలిసారి. గూగుల్ పే ( Google pay ), ఫోన్ పే ( phone pay ), అమెజాన్ పే, పేటీఎం ( paytm ) వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా నేరుగా ఓటర్ల ఎక్కౌంట్ కు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. 


సాధారణంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేటప్పుడు ప్రత్యర్ధులు పట్టుకోవడం, ఘర్షణ చెలరేగడం లేదా ఓటర్లకు పంచే డబ్బుల్లో అవకతవకలు చేయడం  లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడీ డిజిటల్ విధానంలో ఇలాంటి అవకతవకలు, ఘర్షణలకు ఆస్కారం లేదు. పార్టీ అధినేత ఎంత డబ్బులు ఇవ్వాలనున్నాడో ..అంతా నేరుగా ఓటరుకే చేరుతుంది.  


ఈ డిజిటల్ విధానంలో నగదు పంపిణీ ద్వారా..ఎంచుకున్న ఓటర్లందరికీ డబ్బు చేరే అవకాశముంటుంది. దీనికోసం గుట్టుచప్పుడు కాకుండా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ జరిగితే అనుమానం రాకుండా ఉండేందుకు వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఖాతాల్నించి పట్టుకోలేని విధంగా డబ్బు పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ( Ghmc ) పరిధిలో ఓటుకు ఐదు వేల వరకూ ఇస్తున్నారు. Also read: GHMC Elections 2020: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్ స్టేషన్ల వివరాలివే