Road accident in Hyderabad: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్లికి ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించారు... మరో నెల రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. తనకు కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా ఆ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హైదరాబాద్‌లోని (Hyderabad) నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని డీఆర్డీఏ పరివార్ ప్రాంతంలో నిధా రెహమాన్ (34) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అబిడ్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ (Software employee) కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తోంది. యూసుఫ్‌గూడకు చెందిన నవాబ్ ఖాన్ అనే యువకుడితో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవలే ఇరువురు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారు. ఇరువురి పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. వచ్చే నెలలో వివాహం చేయాలని నిశ్చయించారు.


Also Read: 'సీఎం కేసీఆర్​ దీక్ష పంజాబ్​ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా?'


ఇదే క్రమంలో శుక్రవారం (నవంబర్ 19) రాత్రి ఆఫీస్ నుంచి తిరిగొచ్చాక నిధా రెహమాన్... తనకు కాబోయే భర్త నవాబ్ ఖాన్‌ను కలిసేందుకు ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరింది. కింగ్ కోఠి మార్గంలో వెళ్తుండగా.. ఓ లారీని తప్పించబోయి స్కూటీ ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతి అక్కడికక్కడే మృతి (Death in road accident) చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన తమ కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనను కలిసేందుకు వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని నవాబ్ ఖాన్ వాపోయారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook