Drunk and drive cases: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎఫెక్ట్- వేలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు!
Drunk and drive cases: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కఠిన నిబంధనలు విధించినా.. బేఖాతరు చేసిన వారిపై చర్యలు చేపట్టారు పోలీసులు
Drunk and drive cases: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భారీగా మందుపబాబులు పట్ట్టుబడ్డారు. వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చి.. తాగి వాహనాలు నడపొద్దు అన్నా చాలా మంది పోలీసుల మాట్లు లెక్క చేయలేదు. నగర వ్యాప్తంగా ఒక్క రోజులోనే మొత్తం 3,146 కేసులు (Drunk and drive cases in Hyderabad) నమోదయ్యాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 1,528 కేసులు నమోదవగా..హైదారాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,258 కేసులు నమైదైనట్లు పోలీస్ విభాగం వెల్లడించింది. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360మంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డట్లు పోలీస్ విభాగం వెల్లడించింది. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 265 బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు (Hyderabad Drunk and drive cases) తెలిపింది.
రూల్స్ మరిచి..
న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పేందుకు చాలా మంది డిసెంబర్ 31న భారీగా వెడుకలు (New Year 2022) జరుపుకున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం కూడా మధ్య రాత్రి వరకు మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, పబ్‌లలో మధ్య రాత్రి ఒంటి గంట వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది.
అయితే వేడుకలకు అనుమతి మంజూరు చేసినప్పటికీ.. కఠిన ఆంక్షలను కూడా విధించింది. డీజేలు, రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడంపై నిషేధం విధించింది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం హెచ్చరించింది. మందుబాబులకోసం మధ్య రాత్రి కూడా ఆర్టీసీ బస్సులను నడిపింది. అయినప్పటికీ.. కొంత మంది నిబంధనలు తుంగలో తొక్కి.. పోలీసుల తనిఖీల్లో బయపడ్డారు.
Also read: Telangana liquor sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ కొత్త రికార్డు- నెలలో రూ.3,350 కోట్ల విక్రయాలు!
Also read: Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook