Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి

Karate Kalyani Latest News: మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన కేసులో నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. నిందితుడ్ని వెంటనే శిక్షించాలంటూ పలువురు సోషల్‌మీడియా వేదికగా గళమెత్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 01:01 PM IST
Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి

Karate Kalyani Latest News: సినీ నటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడం వల్ల కరాటే కల్యాణిపై జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. 

సినిమాల్లో లేడీ కమెడియన్ గానే కాకుండా అనేక సీరియల్స్ లోనూ నటించి.. నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో బిగ్ బాస్ షోలో పోటీ పడిన కరాటే కల్యాణి.. ఇటీవలీ కాలంలో తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కరాటే కల్యాణి పేరు మీద ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు జగద్గిరి గుట్ట పోలీసులకు ఆదేశాలు పంపగా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

అయితే కరాటే కల్యాణి కి ఈ మైనర్ బాలిక హత్య కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని వివరాలు ఇంకా తెలియలేదు. ఇక ఈ మధ్యనే కల్యాణి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరింది. అలాగే 'మా' ఎన్నికల్లో కూడా విష్ణు తరఫున సెక్రెటరీగా పోటీ చేసింది. అయితే ఈ కేసు విషయంలో కరాటే కల్యాణి ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది. 

ALso Read: Ex MLC Fariduddin: అనారోగ్యంతో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

Also Read: Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News