Viral Video: కన్న కొడుకుని స్తంభానికి కట్టేసి.. కంట్లో కారం చల్లిన తల్లి! ఎందుకో తెలుసా?
Mother hits her 15 years old Son in Kodad. మత్తు పదార్థాలకు బానిస కన్న కొడుకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినలేదు. వేరే గత్యంతరం లేక కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పోసి మరీ బాదింది.
Mother hits her 15 years old Son was becoming a Ganja Addict: తమలా కాకుండా.. కొడుకు ఉన్నత చదువులు చదవాలనుకుంది ఆ తల్లి. మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంది. కానీ చెడు స్నేహాల కారణంగా మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు కన్న కొడుకు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా.. అతడు మాట వినలేదు. కన్న కొడుకు జీవితం తన కళ్ల ముందే నాశనం అవుతుంటే.. ఆ తల్లి మనసు తల్లడిల్లింది. వేరే గత్యంతరం లేక కఠినంగా వ్యవహరించింది. కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పోసి మరీ బాదింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు పాఠశాలకు వెళ్లకుండా.. స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డాడు. స్నేహితుల కారణంగా మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. ప్రతిరోజు గంజాయి తీసుకుని మత్తులో ఊగిపోయేవాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి.. ఆరోగ్యం పాడవుతుందని రిక్వెస్ట్ చేసింది. అయినా పద్ధతి మార్చుకోని అతడు.. గంజాయికి మరింత ఎడిక్ట్ అయిపోయాడు.
రోజూ గంజాయి మత్తుతో ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఆ తల్లి మనసు తల్లడిల్లింది. ఎలాగైనా కొడుకును దారిలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న ఆ తల్లి.. ఇరుగుపొరుగువాళ్ల సాయంతో కొడుకుని ఇంటిముందున్న స్తంభానికి తాళ్లతో కట్టేసింది. దేహశుద్ధి చేసిన అనంతరం.. కారం తీసుకొచ్చి కళ్లలో కొట్టింది. ఆ కొడుకు గిలగిలా కొట్టుకుంటుంటే లోలోపల ఆ తల్లి కుమిలిపోయింది. మత్తు పదార్థాలు మానేస్తానని కొడుకు మాట ఇవ్వడంతో.. ఆ తల్లి శాంతించింది. కొడుకుకు స్నానం చేయించి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గంజాయి దందాపై పోలీసులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆ తల్లి వేడుకుంది. తన కొడుకులో మార్పు తేవడం కోసమే ఇలా కఠినంగా వ్యవహరించానని పేర్కొంది. డ్రగ్స్ కల్చర్ చాపకింద నీరులా రోజురోజుకి రాష్ట్రమంతా విస్తరించిపోతుంది. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకూ ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మొన్నటివరకు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్.. ఇప్పుడు పల్లెల్లోకి కూడా విస్తరించి పోయింది. కోదాడ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి యువత గంజాయి మత్తులో ఊగిపోతోంది. ఇప్పటికే అక్కడ పలు గంజాయి కేసులు నమోదయ్యాయి.
ALso Read: Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!
Also Read: Corona Tsunami: బ్రిటన్‌లో కరోనా సునామీ, వారానికి 50 లక్షల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook