Corona Tsunami: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా లేదు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కరోనా సునామీ పట్టుకుంది.
కరోనా మహమ్మారి ఇంకా వీడలేదు. కాస్త రిలాక్స్ అవుతున్న ప్రజలపై పిడుగులాంటి వార్త ఇది. బ్రిటన్ దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 భయంకరంగా వణికిస్తోంది. కోవిడ్ సంక్రమణ అత్యంత వేగంగా ఉంటోంది. కరోనా మహమ్మారి బ్రిటన్‌లో సునామీలా విరుచుకుపడుతోంది. వారానికి ఏకంగా 50 లక్షల కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో దేశంలో ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. గత వారం కరోనా సంక్రమణ కేసుల సంఖ్య 43 లక్షలుగా ఉంది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కరోనా సంక్రమణ తిరిగి పుంజుకోడానికి కారణమని తెలుస్తోంది. ఎందుకంటే బ్రిటన్‌లో ఫిబ్రవరి నెలలోనే కరోనా ఆంక్షలన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేసింది. అప్పట్నించే కరోనా కేసులు పెరుగుతున్నాయని సమాచారం. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నా..మరణాల సంఖ్య తక్కువే ఉంటుంది. కరోనా వేరియంట్ కొత్తరూపం ఎక్స్‌ఈ ఇప్పుడు ప్రపంచానికి తలపోటుగా మారింది. ఈ వేరియంట్ గతంలోని కోవిడ్ మ్యూటెంట్ల కంటే వేగంగా సంక్రమిస్తుందని తేలింది. ఈ వేరియంట్‌ను తొలిసారిగా యూకేలో జనవరి 19న కనుగొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వీ 1.1.529, బీఏ 1, బీఏ 2, బీఏ 3, బీఏ 4 రకాలుగా ఉంది.
Also read : China Corona Cases: చైనాలో భారీగా పెరిగిన కొవిడ్ వ్యాప్తి.. ఒక్కరోజే 13 వేల కేసులు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook